రిటైర్డు తెలుగు పండిట్‌ ప్రమీలారాణి మృతికి నివాళి

నరసరావుపేటః వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా సోదరి , రిటైర్డు తెలుగు పండిట్‌ కందుల ప్రమీలారాణి (60) మృతికి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రమీలా రాణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి క్రిస్టియన్‌పాలెంలోని ఆమె స్వగృహానికి వెళ్ళీ మృతేదేహాన్ని సందర్శించి ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. ప్రమీలారాణి నరసరావుపేటలోని హర్డుహైస్కూలులో తెలుగుపండిట్‌గా పనిచేసి రిటైరయ్యారు.
Back to Top