మహానేతకు ఘన నివాళి

  • వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల ప్రార్థనలు
  • క్రిస్మస్‌ వేడుకలలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ జగన్‌ సతీమణి వైయస్‌ భారతమ్మ, సోదరి షర్మిలమ్మ, అనిల్‌ శనివారం ఉదయం ఇడుపులపాయను సందర్శించి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. 

సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి కొద్దిసేపు మౌనంగా అక్కడే మోకరిల్లారు. సమీపంలో ఉన్న వైయస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో  ఇతర కుటుంబసభ్యులు, పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
 

Back to Top