గిరిజనుల సలహా మండలి సంగతి ఏమైంది..!

హైదరాబాద్) అసెంబ్లీలో అంబేద్కర్ 125వ శత జయంతి ఉత్సవాల మీద మాట్లాడుతూ వైఎస్
జగన్ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్న వేశారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ లో గిరిజనుల
సలహా మండలి ఏర్పాటు చేయలేదని నిలదీశారు. సలహా మండలి లో మూడింట రెండు వంతుల మంది
సభ్యులు గా ఎమ్మెల్యేలు ఉండాలని గుర్తు చేశారు. ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలకు గాను ఆరుగురు
ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి ఉండటంతో అత్యధికులు ప్రతిపక్ష సభ్యులు అవుతారన్న
ఏకైక కారణంతో గిరిజనుల సలహా మండలి ని ఏర్పాటు చేయటం లేదని సభకు తెలియపరిచారు.
రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు ఇవ్వాల్సిన హక్కుల్ని పాటించటం లేదని విన్నవించారు.

 

Back to Top