<strong>వైయస్ జగన్‌కు మొరపెట్టుకున్న కరాస వలస గ్రామస్తులు</strong>విజయనగరంః విషజ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడుతున్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కరాస వలస గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.కరాస వలసలో జ్వరాలతో ఒకే నెలలో 11 మంది మృతి చెందారన్నారు. వైయస్ జగన్‌ను కరసా వలస గ్రామస్తులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రభుత్వం వైద్యం అందడంలేదు. రోగాలు ముసురుకుంటున్నా వైద్యం అందక దయనీయ పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు. మృతివారి కుటుంబాల వారికి ప్రభుత్వం నుంచి సాయం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే తమ వారిని కోల్పయామంటూ మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.