ద‌ళిత నేత‌పై పోలీసుల దౌర్జ‌న్యం

- రైల్‌రోకోలో పాల్గొన్న అశోక్‌బాబుపై పోలీసుల ప్ర‌తాపం
- బాలినేని అరెస్టు 
- ఒంగోల్ రైల్వే స్టేష‌న్‌లో ఉధృక్త‌త‌
ప్ర‌కాశం: ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఢిల్లీలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు చేప‌ట్టిన ఆమ‌ర‌ణ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా వైయ‌స్ఆర్‌సీపీ పిలుపుమేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా రైల్‌రోకో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే చంద్ర‌బాబు పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని ఉద్య‌మాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒంగోలు జిల్లాలో రైల్‌రోకో కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ద‌ళిత నాయ‌కుడు వ‌రికూటి అశోక్‌బాబుపై పోలీసులు దౌర్య‌న్యానికి దిగారు. చొక్కా ప‌ట్టుకొని ఈడ్చుకెళ్లి లారీలో ప‌డేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ అయిన అశోక్‌బాబుపై పోలీసులు ప‌ట్ట‌ప‌గ‌లే దాడికి పాల్ప‌డ‌టం బాధాక‌రం. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డిని పోలీసులు బ‌ల‌వంతంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌ప్పుప‌డుతున్నారు. చంద్ర‌బాబు ద‌గ్గరుండి ఈ కార్య‌క్ర‌మాన్ని విఫ‌లం చేస్తున్నార‌ని ఉద్య‌మ‌కారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top