బూత్‌ కమిటీలకు శిక్ష‌ణ‌

మైలవరం:

 వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బూత్‌ కమిటీల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని  పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మైలవరంలోని ఎస్‌వీఎస్‌ కళ్యాణ మండపంలో ఈ సభను ప్రారంభిస్తామని చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్‌పీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

Back to Top