వైయ‌స్ఆర్‌సీపీ బూత్‌ కమిటీ సభ్యులకు శిక్షణ

రాయదుర్గం

: రాయదుర్గం నియోజకవర్గంలోని వైయ‌స్ఆర్‌ సీపీ బూత్‌ కమిటీ సభ్యులకు గురువారం శిక్షణ శిబిరం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి నివాసం వద్ద నిర్వహించిన శిక్షణ శిబిరంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బూత్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌టీ సిద్దప్ప, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, పార్టీ కన్వీనర్లు నబీష్, మల్లికార్జున, ఆలూరి చిక్కణ్ణ, కౌన్సిలర్లు గోనబావి సర్మస్, అబ్దుల్‌రహిమాన్, మాజీ కౌన్సిలర్‌ పద్మజ, వసంతరాజు, సీతారాం, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Back to Top