యంత్రంతో పొలంలో నాట్లు వేసిన వైయస్‌ జగన్‌
చిత్తూరు: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాట్లు వేసే యంత్రాన్ని పరిశీలించారు. చంద్రగిరి నియోజకవర్గ కమ్మపల్లిలోని వ్యవసాయక్షేత్రంలోని రైతులతో కలిసి వైయస్‌ జగన్‌ నాట్లు వేసే యంత్రాన్ని నడిపారు. పంట సాగు, దిగుబడి, పెట్టుబడి విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు జననేతను కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకుంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే మాకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.
Back to Top