వైయ‌స్ఆర్‌సీపీ ప‌ట్ట‌ణ యూత్‌ అధ్య‌క్షుడిగా ప‌వ‌న్‌

చంద్రగిరి(చిత్తూరు): వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ యూత్ అధ్య‌క్షుడిగా చంద్రగిరి పాతపేటకు చెందిన కొత్తపాటి పవన్‌ కుమార్‌ రెడ్డిను నియమిస్తున్నట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాద‌ళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి సూచనల మేరకు నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి పార్టీ పట్టణ యూత్ అధ్య‌క్షుడిగా నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామికి, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో పాటు మండల పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీను బలోపేతానికి కృషి చే స్తానని ఆయన వెల్లడించారు.
Back to Top