సీమాంధ్రలో బంద్..ఉధృతంగా ఆందోళనలు

హైదరాబాద్‌, 24 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమరదీక్షను భగ్నం చేసినందుకు, ఆమెను అవమానకరంగా ఆస్పత్రికి‌ తీసుకువెళ్లిన తీరుకు నిరసనగా సీమాంధ్ర మొత్తం శనివారంనాడు బంద్ ‌నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో శ్రీమతి విజయమ్మ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం అర్దరాత్రి సుమారు 1.55 నిమిసాలకు పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేయడం పట్ల, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్ర బంద్కు పిలుపు ఇచ్చింది. ‌పార్టీ పిలుపునకు సీమాంధ్ర అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది.

సీమాంధ్రలోని 13 జిల్లాలలో పూర్తిగా బంద్ పాటిస్తున్నారు.‌ సీమాంధ్ర వ్యాప్తంగా వ్యాపార సంస్థలను మూసివేశారు. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. విజయవాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతి త‌దితర పట్టణాలలో వైయస్ఆర్ ‌కాంగ్రెస్ ‌నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు ఉధృతం చేశారు. గుంటూరు జిల్లా  తెనాలిలో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ జడ్పీ ఛైర్మన్ సుబ్ర‌హ్మణ్యంరెడ్డి ఆధ్వరంలో బంద్ ‌కొనసాగుతోంది.

వైయస్ఆర్ జిల్లా కడప అప్సర సర్కి‌ల్ నుంచి వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బం‌ద్ ‌పాటిస్తున్నారు. ప్రొద్దుటూరులో కూడా పార్టీ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నారు.‌ తూర్పుగోదావరి జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బం‌ద్ జరుగుతోంది. ఎమ్మెల్యే బాలరాజు   పశ్చిమ గోదావరి జిల్లా బం‌ద్కు పిలుపు ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో పార్టీ  అధ్యక్షుడు తోట గోపి ఆధ్వర్యంలో బం‌ద్ నిర్వహిస్తున్నారు.

‌అనంతపురంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రహదారులను దిగ్బంధనం చేశారు. వారి ఆందోళనకు  ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. గుత్తి, పామిడి, రాప్తాడు, పెనుకొండలలో రహదారులను ది‌గ్బంధించారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్నారు.

విశాఖపట్నంలోని మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్, గాజువాకలో సమైక్యవాదుల రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ జరు‌గుతోంది. నెల్లూరు జిల్లాలో వ్యాపార సంస్థలు  స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. నెల్లూరు బెజవాడ గోపాలరెడ్డి సర్కి‌ల్‌లో విద్యార్థులు రాస్తా రోకో చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను కదలనివ్వడంలేదు. విజయవాడలో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కళాశాలలు, దుకాణాలు బంద్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వ్యాపారులు బం‌ద్ పాటిస్తున్నారు.

Back to Top