పరిటాల సునిత రాజీనామా చేయాలి

అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలకు పాల్పడుతుందని రాప్తాడు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి  అన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి మద్దతుగా నిలిచిన సూర్యనారాయణపై దాడికి పాల్పడిన పరిటాల సునిత అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని, పరిటాల సునిత తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై నిత్యం దాడులు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్న మంత్రి పరిటాల సునిత రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రి పరిటాల సునితతో తనకు ప్రాణ హాని ఉందని వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

 
Back to Top