'తూర్పు' ఎస్సీ సెల్ కన్వీనర్‌ నియామకం

కాకినాడ:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్‌గా శెట్టిబత్తుల రాజబాబు నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ఆమోదంతో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశరావు ఈ నియామకాన్ని ఖరారు చేశారు. అమలాపురం నియోజకవర్గం కొమరగిరిపట్నానికి చెందిన శెట్టిబత్తుల రాజబాబు బి.ఎల్ చేసి న్యాయవాదిగా ఉంటూ అనేక దళిత ఉద్యమాల్లో దాదాపు 20 ఏళ్లుగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

Back to Top