రేపు రాయచోటిలో వైయస్సార్‌సీపీ ప్లీనరీ

–విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పిలుపు
రాయచోటి రూరల్‌: ఈ నెల 7వ తేది రాయచోటిలో వైయస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్లీనరీ సమావేశంలో టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపైన , వైఎస్సార్‌సీపీ భవిష్యత్‌ నిర్మాణంపైన చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్‌ వివేకానందరెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, జడ్పీ చైర్మన్‌ గూడూరు రవి, కడప మేయర్‌ సురేష్‌ బాబులతో పాటు పలువురు ప్రముఖ నేతలు పాల్గొంటారని తెలియజేశారు. బుధవారం పట్టణంలోని గున్నికుంట్ల రోడ్డుమార్గంలో ఉన్న అల్తాప్‌ కల్యాణమండపంలో మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ సమావేశంలో ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు.
Back to Top