రేపు తెలంగాణ వైయస్‌ఆర్‌సీపీ అత్యవసర సమావేశం


హైదరాబాద్‌: ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ వైయస్‌ఆర్‌సీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.  రేపు ఉదయం 11.30 గంటలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరవుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ముఖ్యనేతలంతా హాజరుకావాలని గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు.
 
Back to Top