దళిత మహిళను పరామర్శించనున్న ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: భూకబ్జాలకు అడ్డువస్తుందని ఓ దళిత మహిళలపై టీడీపీ నేతలు దాడి చేసి ఆమెను వివస్త్రను చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జె్రరిపోతులపాలెంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రజా సంఘాలు ఖండించాయి. దళిత మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వై. విజయసాయిరెడ్డి రేపు దళిత మహిళను పరామర్శించనున్నారు. 
Back to Top