రేపు సోష‌ల్ మీడియా వాలంటీర్ల ఆత్మీయ స‌మ్మేళ‌నంతూర్పు గోదావ‌రి:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తి జిల్లాలో ఏదో ఒక సామాజిక వ‌ర్గంతో ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హించి వారి క‌ష్టాలు తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 23న తూర్పు గోదావ‌రి జిల్లా తాటిపాక ప‌ట్ట‌ణంలో సోష‌ల్ మీడియా వాలంటీర్ల ఆత్మీయ స‌మ్మేళ‌నం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా కో-ఆర్డినేట‌ర్ దేవేంద్రారెడ్డి గుర్రంపాటి, త‌దిత‌రులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలే సరైన ఆయుధాలన్నారు. వైయ‌స్ జగన్ ప్రకటించిన నవరత్నాలను సోష‌ల్ మీడియా వేదిక‌గా విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నామ‌న్నారు. సోష‌ల్ మీడియా వాలంటీర్ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశ‌మై ఈ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో దిశానిర్దేశం చేస్తార‌ని దేవేంద్రారెడ్డి తెలిపారు. సోష‌ల్ మీడియా వాలంటీర్లు ఆత్మీయ స‌మ్మేళ‌నానికి హాజ‌రు కావాల‌ని ఆయ‌న కోరారు.
Back to Top