రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌

గుంటూరు: ఈ నెల 13వ తేదీ గుంటూరు జిల్లా గుర‌జాల‌లోని అక్ర‌మ క్వారీల‌ను ప‌రిశీలించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నిజ నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌టించ‌నుంది. పిడుగురాళ్ల‌, దాచేప‌ల్లిలో నిర్వ‌హిస్తున్న అక్ర‌మ క్వారీల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌రిశీలిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ గుర‌జాల స‌మ‌న్వ‌య‌క‌ర్త కాసు మ‌హేష్‌రెడ్డి తెలిపారు. అయితే నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని అడ్డుకునేందుకు టీడీపీ నాయ‌కులు పోలీసుల‌తో నోటీసులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అక్ర‌మ మైనింగ్ కేసు నుంచి త‌ప్పించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు.  
Back to Top