రేపు బ్లాక్ డే పాటిద్దాం

హైద‌రాబాద్‌: ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా ఈ నెల 24న రాత్రి 7 గంట‌ల నుంచి 7.30 గంట‌ల వ‌ర‌కు దీపాలు ఆర్పి బ్లాక్ డే పాటిద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ మేర‌కు కేంద్రం కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వారం రోజుల క్రితం వైయ‌స్ఆర్‌సీపీ, వామ‌ప‌క్షాలు,  ప్ర‌త్యేక హోదా సాధ‌న‌ స‌మితి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ఈ నెల 24న బ్లాక్ డే పాటించాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ పార్ల‌మెంటు జిల్లా పార్టీ అధ్య‌క్షులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పాల్గొని ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష‌ను మ‌రోమారు చాటిచెబుదామ‌ని పార్టీ పిలుపునిచ్చింది.

Back to Top