<strong>ఏలూరు, 13 మార్చి 2013:</strong> తోకపార్టీ ఎవరిదో ఉప ఎన్నికల ఫలితాల్లోనే తేలిపోయిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు వ్యాఖ్యానించారు. టిడిపికి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని తోకపార్టీ అని వ్యాఖ్యానించిన చంద్రబాబుపై శేషుబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు.<br/>చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా రాష్ట్ర ప్రజలు ఆయనను అస్సలు నమ్మబోరని శేషుబాబు అన్నారు. భవిష్యత్తులో కూడా ఎవరిది తోకపార్టీయో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అవిశ్వాసం పెట్టేది లేదంటూ చంద్రబాబు అనడంతోనే కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కయ్యారన్న విషయం స్పష్టంగా తెలిసిపోయిందని శేషుబాబు అన్నారు.