సామర్లకోట - పెద్దాపురంలలో నేటి పాదయాత్ర

సామర్లకోట (తూ.గో.జిల్లా),

17 జూన్‌ 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ‌శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సోమవారం 182వ రోజు చేసే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం,‌ తూర్పుగోదావరి జిల్లా కన్వీన‌ర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు. సామర్లకోట నుంచి సోమవారం ఉదయం‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దాపురం మున్సిపల్‌ ఆఫీస్‌, దర్గా సెంటర్‌, మరిడమ్మ ఆలయం సెంటర్ వరకూ 6.1 కిలోమీటర్ల నడుస్తారు. ఆ తరువాత మరిడమ్మ సెంటర్ సమీపంలో మధ్యాహ్న భోజ‌న విరామం తీసుకుంటారు.

‌భోజన విరామం అనంతరం పెద్దాపురం ఆర్టీసీ కాంప్లెక్సు, జి.రాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేరు వరకూ 8.5 కిలో మీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారని రఘురాం, చిట్టబ్బాయి తెలిపారు. సోమవారం రాత్రికి పులిమేరులోనే ఆమె బస చేస్తారు. కాగా, సోమవారంనాడు మొత్తం 14.6 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని రఘురాం, చిట్టబ్బాయి వివరించారు.

Back to Top