'గుంటూరు'లో నేడు షర్మిల సమైక్య శంఖారావం

గుంటూరు, 11 సెప్టెంబర్ 2013:

గుంటూరు జిల్లాలో నేడు శ్రీమతి షర్మిల ‘సమైక్య శంఖారావం’ మార్మోగనున్నది. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తనయ, వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల బుధవారం జిల్లాలో సమైక్య శంఖారావం పూరిన్తారు. సమన్యాయం చేయని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో శ్రీమతి షర్మిల ఈ నెల 2 నుంచి ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్ర బుధవారం జిల్లాలోని వినుకొండకు చేరనుంది. వినుకొండలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట బహిరంగ సభ జరగనుంది.

ఆ తరువాత శ్రీమతి షర్మిల బస్సు యాత్ర కోటప్పకొండ మీదుగా చిలకలూరిపేట -పసుమర్రు - పెదనందిపాడు - కాకుమాను - బాపట్ల - చందోలు - చెరుకుపల్లి - భట్టిప్రోలు మీదుగా రేపల్లె చేరుకుంటుంది. మధ్యాహ్నం రేపల్లె నెహ్రూ సెంటర్‌లో బహిరంగ సభ జరుగుతుంది. శ్రీమతి షర్మిల యాత్ర మొత్తం జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల మీదుగా సాగనుంది. రేపల్లె నుంచి కృష్ణాజిల్లాలోని అవనిగడ్డకు చేరుకుని అక్కడ బహిరంగ సభ అనంతరం రాత్రి అవనిగడ్డలో బస చేస్తారని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, గుంటూరు ‌జిల్లా కన్వీన‌ర్ మర్రి రాజశేఖర్ వెల్లడించారు.‌

తాజా వీడియోలు

Back to Top