శుక్రవారం పాదయాత్ర సాగేదిలా

విశాఖపట్నం 28 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వై.యస్.జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్ర 193వ రోజు సాగే వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు  ప్రకటించారు. శ్రీమతి షర్మిల శుక్రవారంనాడు చోడవరం నియోజకవర్గంలోని టి.అజ్జాపురంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. మేడివాడ మీదుగాసాగి గర్నికం సమీపంలో భోజన విరామం తీసుకుంటారు. రావికమతం, కోమళ్లపూడి, పొట్టిదొరపాలెం మీదుగా సింగవరంలో ఐదో రోజు యాత్ర ముగుస్తుంది. ఈ గ్రామ సమీపంలో బస చేస్తారు.

Back to Top