నేడు నూజివీడులో వైయ‌స్ఆర్ సీపీ ప్లీన‌రీ

కృష్ణా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నూజివీడు నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గ పరిధిలోని రోటరీ ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ప్లీనరీ సమావేశం జరుగనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకులు, పలు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ప్లీనరీలో పలు కీలక విషయాలను చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Back to Top