నేడు కొవ్వొత్తుల ప్రదర్శన..

 

రేపటి నుంచి రిలే నిరాహారదీక్షలు  

అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనను మరింత ఉధృతం చేసింది. వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు చేపట్టనున్న ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగబోతోంది. ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 7న‌ శనివారం నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సూచించారు. ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణ‌యించారు. మ‌రోవైపు ప్రత్యేక హోదా కోసం పదవులను త్యాగం చేసి, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్న ఎంపీలకు మద్దతుగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అనేక మంది ఢిల్లీ తరలివెళ్లారు. 

Back to Top