నేడు "వైయ‌స్ఆర్ కుటుంబం" ప్రారంభం

హైద‌రాబాద్‌:  నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వైయ‌స్ఆర్‌ కుటుంబాన్ని అభిమానించే ప్రజలను పార్టీతో మమేకం చేయడమే లక్ష్యంగా ఇవాళ వైయ‌స్ఆర్ కుటుంబం అనే కార్య‌క్ర‌మాన్ని పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించ‌నున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందులలోని వైయ‌స్ఆర్‌ ఆడిటోరియంలో ఈ కార్య‌క్ర‌మాన్నిప్రారంభిస్తారు. నియోజకవర్గాలవారీగా బూత్‌ కమిటీల నియామకం పూర్తయిన నేపథ్యంలో ఈ కమిటీలను క్రియాశీలకం చేయడంతో పాటు, సభ్యత్వ నమోదును ప్రారంభించాలని అధినేత నిర్ణయించారు. కమిటీ అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి వీరి ద్వారా కమిటీల సభ్యులందరినీ కలుపుకొని ప్రతి ఇంటికీ నవరత్నాల పథకాలను తీసుకెళ్తారు. ఈ కార్యక్రమాన్ని వైయ‌స్ జగన్‌ ప్రారంభించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జనంలోకి తీసుకెళ్లారు. 

తాజా ఫోటోలు

Back to Top