నేడు క‌డ‌ప‌లో మహా ధర్నా


 
వైయ‌స్ఆర్ జిల్ఆ : విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నాను చేపట్టింది. జూన్‌ 23 నుంచి 26 వరకు కడపలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇటీవ‌ల వైయ‌స్ఆర్‌సీపీ రాయ‌ల‌సీమ ఇన్‌చార్జ్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ నెల 24న(జూన్‌) బద్వేలులో మహా ధర్నా, రాజాంపేటలో 25న మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా జూన్‌ 27న జాతీయ రహదారుల దిగ్బంధం, కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం డిమాండ్‌ చేస్తూ జూన్‌ 29న రాష్ట్ర బంద్‌కు వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునిచ్చింది.   

Back to Top