ప్రకాశం జిల్లాలో వైయస్ జగన్‌ పర్యటన

ఒంగోలు: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి కందుకూరు చేరుకున్న జగన్‌ స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో బస చేశారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో వైయస్ జగన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులను కలసి వారి కష్టాలు తెలుసుకుంటారు.  ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్య శ్రీని కాపాడటంతో పాటు  ప్రభుత్వానికి ప్రజారోగ్య బాధ్యతను గుర్తుచేసేందుకు బాధ్యతగలిగిన ప్రతిపక్షనేతగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

Back to Top