ఫ్యాన్లే తోరణాలు– వైయస్‌ జగన్‌కు వినూత్నంగా స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు
–  కాకినాడలో పండుగ వాతావరణం
- నేడు కాకినాడ న‌గ‌రంలోకి  వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
తూర్పు గోదావ‌రి: ఒక్క నేతతో వేల అడుగులు.. కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ అభిమానం రెట్టింపు అవుతోంది. జనాభిమానం పోటెత్తుతోంది. 
వైయస్‌ జగన్‌కు వినూత్న స్వాగతం పలికేందుకు కాకినాడ వాసులు సిద్ధమయ్యారు. వీధుల్లో తోరణాలు కట్టినట్లు ఫ్యాన్లులు కట్టి అభిమానం చాటుకున్నారు.  ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కాకినాడ న‌గ‌రంలోకి ప్ర‌వేశిస్తోంది. ఈ సంద‌ర్బంగా జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కొవ్వాడలో అడుగుపెట్టగానే అదే సాక్షాత్కరించింది. అన్న ఆశీర్వాదం పొందేందుకు అక్కాచెల్లెమ్మలు.. మనవడిని చూసేందుకు అవ్వాతాతలు.. కొడుకుగా అండగా నిలుస్తాడన్న ఆశతో తల్లులు.. తమ భవిష్యత్‌ కోసం పరితపిస్తున్న జననేతను చూడాలని యువకులు అశేషంగా తరలివచ్చారు. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి పూలబాటతో ఎదురేగి స్వాగతం పలికారు. ఆత్మీయ నేతను అక్కున చేర్చుకుని, అడుగులో అడుగేసి దారి పొడవునా నీరాజనం పలికారు. ఇంకేముంది ప్రజా సంకల్పయాత్ర జనజాతరను తలపించింది. 

జ‌న‌సంద్రం
వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర జనసంద్రంగా మారింది. జనం జనం ప్రభంజనంగా ముందుకు సాగుతోంది.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్రను జననేత ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఈ రోజు పాదయాత్రలో ఛీడిగా మీదుగా ఇంద్ర పాలెం చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కాకినాడ ఏఆర్‌సీ సెంటర్‌, సంతచెరువు, కల్పన సెంటర్‌, కోకిల సెంటర్‌ మీదుగా ఆదిత్యా కళాశాల సెంటర్‌ వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. 
Back to Top