'విశాఖ'లో నేడు జగన్ సమైక్య శంఖారావం

విశాఖపట్నం‌ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి శ్రీ జగన్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా చోడవరం వె‌ళతారు. మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.

‌అనంతరం చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడి సభలో శ్రీ వైయస్ జగ‌న్‌ ప్రసంగిస్తారు. తరువాత ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్సు గార్డెన్సులో జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి శ్రీ జగన్ హాజరవుతారు.

Back to Top