నేడు ర‌హ‌దారుల దిగ్బంధం


వైయ‌స్ఆర్ జిల్లా: క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లాలోని అఖిల‌ప‌క్షాలు కూడా మ‌ద్ద‌తు ప‌లికాయి. ఈ నెల 23వ తేదీన క‌డ‌ప న‌గ‌రంలో మ‌హాధ‌ర్నా నిర్వ‌హించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు 24న బ‌ద్వేల్‌, 25న రాజంపేట‌లో ధ‌ర్నా చేప‌ట్టారు. 26న జ‌మ్మ‌ల‌మ‌డుగులో సంక‌ల్ప దీక్ష చేప‌ట్టారు. ఇవాళ ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ పోరాటానికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఈ ప్ర‌భుత్వం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌క‌పోతే వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే ఏర్పాటు చేస్తామ‌ని పార్టీ నాయ‌కులు పేర్కొంటున్నారు.
Back to Top