క‌ష్టాలు తెలుసుకుంటూ..క‌న్నీళ్లు తుడుస్తూ..- విశాఖ జిల్లాలో విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
-  సబ్బవరంలో నేడు బహిరంగ సభ
 
 
విశాఖపట్నం:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని స్థాయిలో స్పందన లభిస్తోంది. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుంటూ..వారి క‌న్నీళ్లు తుడుస్తున్నారు. అలుపెరుగని పధికుడు వైయ‌స్ జగన్‌ చేస్తున్న పాదయాత్రలో పాల్గొనాలని, ఆయనతో కలిసి అడుగులో అడుగేయాలని, రాజన్న తనయుడిని తనివితీరా చూడాలన్న తపనతో అవ్వా తాతల నుంచి మహిళలు, యువతీ యువకులు, చిన్నారుల వరకు తపన పడుతున్నారు. పాదయాత్రగా వస్తున్న జగన్‌ను చూసేం దుకు రోడ్లపైకి వచ్చి ఎంత సమయమైనా వేచిఉంటున్నారు. ఈ దఫా ఎన్ని ప్రలోభాలు ఎదురైనా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలనే ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రజానీకం ఉంది.  చంద్రబాబు మోసాలకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో జ‌న‌నేత పాద‌యాత్ర పూర్తి చేసి ఇవాళ పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగిస్తున్నారు.  

అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం
వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. 255వ రోజు  బుధవారం పెందుర్తి నియోజకవర్గంలోని గుళ్లేప‌ల్లి నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి రావులంపాలెం క్రాస్, ఆదిరెడ్డిపాలెం క్రాస్, స బ్బవరం మీదుగా చినగొల్లలపాలెం క్రాస్‌ వరకు సాగనుంది. సబ్బవరం మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగనున్న పాదయాత్ర, సబ్బవరం జంక్షన్‌లో సాయంత్రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. తమ బతుకుల్లో నవ్వుల పువ్వులు విరిసేలా చేయాలన్న సంకల్పంతో సుదీర్ఘ పాదయాత్ర సాగిస్తున్న జనపథికుడిపై హృదయాలు నుంచి ఉప్పొంగిన ప్రేమాభిమానాలు చూపారు. మేళతాళాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జననేత సంకల్ప సిద్ధి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిపి త్రిమతాల పెద్దలు ఆశీర్వచనాలు అందించారు. అక్కచెల్లమ్మలు దారిపొడవునా హారతులిచ్చారు. గుమ్మడికాయలతో దిష్టితీశారు.. బాణసంచా సందడి మధ్య పాదయాత్ర సాగిన పల్లెలు తిరునాళ్లను తలపించాయి. రోజూ మాదిరిగానే దారిపొడవునా వందలాది మంది జననేతకు తమ గోడు చెప్పుకున్నారు.


Back to Top