నేడు విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర

- దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల పైలాన్‌ ఆవిష్కరణ

- కొత్తవలస వద్ద మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ 
విశాఖపట్నం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలో ప్రవేశించనుంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6 వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి మొదలైన జననేత పాదయాత్ర విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతుంది.  ఈ సందర్భంగా ఆ గ్రామంలో ప్రత్యేకంగా రూపొందించిన పైలాన్‌ను జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం కొత్తవలసలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించింది ప్రసంగిస్తారన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. సోమవారం ఉదయం జననేత 269వ రోజు పాదయాత్రను పెందుర్తి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సారిపల్లి, జంగాలపాలెం, చింతలపాలెం, తాడివానిపాలెం, దేశపాత్రుని పాలెం, కొత్త వలస మీదుగా తుమ్మికపాలెం వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. దేశపాత్రునిపాలెం చేరుకోగానే జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర   ప్రారంభమైంది 

 
 

Back to Top