వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నున్న ఎంపీలు


విజ‌య‌వాడ‌: ఇటీవ‌ల ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఇవాళ సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లువ‌నున్నారు. ఢిల్లీ నుంచి సాయంత్రానికి విజ‌య‌వాడ చేరుకుని వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అవుతారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు  ఈ నెల 6వ తేదీన ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, వైయ‌స్ అవినాష్‌రెడ్డిలు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేప‌ట్టిన విష‌యం విధిత‌మే. వారి ఆరోగ్యం క్షీణించ‌డంతో పోలీసులు బ‌ల‌వంతంగాఆసుప‌త్రికి చేర్చి దీక్ష‌ను భ‌గ్నం చేశారు. కాగా, ఈ నెల 17న రాజీనామా చేసిన నేత‌లు రాష్ట్ర‌ప‌తిని క‌లిసి రాష్ట్ర ప‌రిస్థితులు, కేంద్రం చేస్తున్న అన్యాయాల‌ను వివ‌రించారు. అలాగే పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన లేఖ‌ను రాష్ట్ర‌ప‌తికి అంద‌జేసి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు అమ‌లు అయ్యే విధంగా జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అయి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను చ‌ర్చించ‌నున్నారు.
Back to Top