వైయస్‌ జగన్‌ను కలిసిన పొగాకు కూలీలు

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండంలో పొగాకు కూలీలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. పార్టీల పేరుతో పాలకులు వివక్ష చూపుతున్నారని పొగాకు కూలీలు వైయస్‌ జగన్‌కు వివరించారు. పింఛన్లు, డ్వాక్రా రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు కూడా రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలకు ఒకసారి ఆకు తెంచుతామని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆకు కోస్తే రోజుకు రూ.100 కూలి ఇస్తున్నారని వైయస్‌ జగన్‌కు తెలిపారు. కూలి గిట్టుబాటు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే పొగాకు పని ఉంటుందని కూలీలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి హామీ పనులు కూడా లేవని, ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
Back to Top