పొగాకు రైతులంటే చిన్నచూపేల బాబూ?

  గిట్టుబాటు ధరలేదు... కొనే వారేలేరు. పట్టించుకునే
నాథుడు లేడు. నెలరోజులుగా పొగాకు రైతులు కనబడిన నాయకుడినల్లా అడుగుతున్నారు. అధికార
పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు
పంపుతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. పొగాకు రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం
ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నదో చెప్పడానికి మాటలు చాలవు. కష్టాల ఊబిలో కూరుకుపోయిన పొగాకు
రైతులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ర్టప్రభుత్వాలపై ఉన్నా ఎవరూ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత గలిగిన ప్రతిపక్ష
నేతగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించి పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు రైతుల
కష్టాలు తొలగించాలని రాష్ర్టప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల పదో తారీఖు లోపు
పొగాకు రైతుల సమస్యలు తీర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయినా ఈ ప్రభుత్వానికి
చీమ కుట్టినట్లయినా లేదు. అందుకే 14వ తేదీన పొగాకు కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించాలని
పార్టీ నిర్ణయించింది. ప్రకాశం జిల్లాలో నెలరోజుల్లో ఇద్దరు రైతులు దిగులుతో మరణించారంటే
పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పొగాకు బోర్డు చైర్మన్‌తో వైఎస్‌ఆర్‌సీపీ
ఎంపీలు, ఇతర నాయకులు మాట్లాడినా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు.

      పొగాకు
రైతుల వద్ద సుమారు 170 మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వలు ఉంటే ఇప్పటికి కనీసం 50 మెట్రిక్
టన్నుల పొగాకు కూడా కొనుగోలు చేయలేదు. గత ఏడాది ఇదే సమయానికి 110 మెట్రిక్ టన్నుల పొగాకు
కొనుగోళ్లు జరిగాయి. 2015-16కు సంవత్సరానికి సంబంధించి మాత్రం పొగాకుపై పరిమితులు విధించారు.
అలా పరిమితులు విధించాలనుకుంటే ైపొగాకు రైతులకు ప్రత్యామ్నాయం చూపించి నష్టపరిహారం
ఇవ్వాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వద్ద ఉన్న పొగాకు నిల్వలను పొగాకు బోర్డు
ద్వారా, ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారానైనా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి తమను
ఆదుకోవాలని పొగాకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది కేజీ పొగాకు రు.150 ధర పలికితే
ప్రస్తుతం కేజీ రు.90 పలుకుతోంది. మీడియం గ్రేడ్ పొగాకు కిలోకు రు.80 నుంచి రు.90,
లోగ్రేడ్ 50 నుంచి 60 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. సీటీఆర్‌ఐ లెక్కల ప్రకారం
కిలో పొగాకు పండించడానికి రు.110 ఖర్చు అవుతుందని తేలింది. ప్రస్తుతం సరాసరిన కేజీకి
రు.90 వచ్చే పరిస్థితి కూడా లేదు.

 

 

Back to Top