తిరుపతిలో తక్షణ మద్య నిషేధానికి డిమాండ్

హైదరాబాద్, 26 మార్చి 2013:

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో తక్షణం మద్య నిషేధం విధించాలని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో డిమాండ్ చేశారు. తిరుపతిలో మద్య నిషేధంపై హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగిందనీ, ఇప్పటి వరకూ అది స్పందించకపోవడం  దారుణమనీ ఆయన పేర్కొన్నారు. తిరుపతి పవిత్రతను కాపాడాలన్న చిత్తశుద్ది సీఎమ్ కిరణ్కు లేదని భూమన ఆరోపించారు. ఆధ్యాత్తిక పుణ్యక్షేత్రం అసాంఘిక కార్యక్రమాలకు నెలవైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో మద్య నిషేధం అమలుపై స్థానిక మహిళలు ఎప్పటి నుంచో పోరాడుతున్న విషయాన్ని భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కిరణ్ సర్కారును భూమన హెచ్చరించారు.

Back to Top