టిడిపి నుంచి వైయస్‌ఆర్‌సిపిలోకి భారీగా చేరికలు

గుంటూరు, 2 జనవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రజల నుంచే కాకుండా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా వైయస్‌ఆర్‌సిపిలో చేరేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా టిడిపి నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి కుంచాల శివయ్య, ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన 500 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌సిపి సభ్యత్వం తీసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకర్గం ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సమక్షంలో వారంతా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో వందలాది మంది తమ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.‌ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుమ్మక్కై శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో పెట్టి నిర్బంధించినప్పటికీ ఆయన పట్ల ప్రజల వస్తున్న విశేష ఆదరణను ఇప్పుడు చూస్తున్నామన్నారు.
 
దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులయ్యామని, ఆ పథకాన్నింటిని శ్రీ జగన్‌ నేతృత్వంలోని వైయస్‌ఆర్‌సిపి అమలు చేస్తుందన్న ధీమాతోనే పార్టీలో చేరినట్లు శివయ్య తెలిపారు.
Back to Top