వైయ‌స్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి

విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని తుళ్లూరు వాసులు పేర్కొంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గ‌లో నాలుగో రోజు కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌లో  వైయస్‌ జగన్‌ను తుళ్లూరు వాసులు చంద్రశేఖర్, జాన్‌లు కలిశారు. చంద్రబాబు వల్లన ఆంధ్రకు లాభం లేదని వైయస్‌ జగన్‌ వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కనకదుర్గమ్మ ఆలయం గుండా 62 ఫిల్లర్ల ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించడానికి ఆరునెలల సమయం సరిపోతుందని, కాని ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలయిందని కనీసం ఫిల్లర్లు కూడా పూర్తి అవ్వలేదని విమర్శించారు. బీజేపీ నాయకులు రూ. 2 లక్షల 30వేల కోట్ల ఇచ్చామని లెక్కలు చూపుతున్నారని దానికి చంద్రబాబు సమాధానం చెప్పడంలేదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 
Back to Top