చంద్రబాబు అవివేకానికి నిదర్శనం

విజయవాడః వరద ముంపు, భూకంపాల జోన్ గా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకోవడం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమని  వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి ఆరోపించారు. తుళ్లూరును రాజధాని ఎంపికచేయడం ప్రజ్లలో గందరగోళాన్ని సృష్టించేదిగా ఉందన్నారు.  కృష్ణానది అనేక సార్లు ఈప్రాంతాన్ని వరదలతో ముంచెత్తిన సంగతి తెలిసిందేనన్నారు. వరద ముంపుతో జలమయమైన ప్రాంతంలో  వేలాది కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేస్తాననడం సరికాదన్నారు. 

శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధానికి పంట భూములు తీసుకోవద్దని చెప్పిన విషయాన్ని గౌతంరెడ్డి ఈసందర్భంగా గుర్తు చేశారు. భూంకపాల జోన్ గా ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే వేలాది కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతుందన్నారు. అదేవిధంగా చెన్నై, ముంబైలలో వరదలు రాజధానిని ఎలా ముంచెత్తాయో చూసి దాన్నుంచైనా చంద్రబాబు గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఆస్తి, ప్రాణ నష్టాలతో పాటు పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని, దీనివల్ల భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసిన వారమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
Back to Top