బెదిరింపులు స‌రికాదు మంత్రి గారూ..మాజీ ఎమ్మెల్యే కుర‌సాల‌

కాకినాడ :  రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం బెదిరింపుల‌కు దిగ‌టం స‌రికాద‌ని మాజీ ఎమ్మెల్యే, తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ముఖ్య కేంద్రం కాకినాడ‌లో మీడియాతో మాట్లాడారు. కోనసీమలో క్రాఫ్ హాలిడే ప్రకటించిన రైతులను బెదిరించ వద్దని ప్రభుత్వానికి సూచించారు.
హోంమంత్రి చినరాజప్ప పోలీసులను సదరు ప్రాంతానికి పంపి రైతులను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని . రుణమాఫీ పుణ్యమా అని రైతులకు పరపతి పోయిందన్నారు. పంట విరామం చేయాలని తాము కోరుకోవడం లేదని..  ఆ దుస్థితి రాకూడదన్నారు. రైతుల ఆందోళన చేస్తే తమ పార్టీ మద్దతిస్తుందని కన్నబాబు స్పష్టం చేశారు.

Back to Top