ఎమ్మెల్యే ఆర్కే కు బెదిరింపులు

గుంటూరుః డీజీపీకి మంగళగిరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి లేఖ రాశారు.తనకు బెదిరింపులు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇసుక మాఫియా, రాజధాని భూసేకరణ, ఓటుకు కోట్లు కేసు, సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనేక అంశాలపై ఆర్కే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. గతంలో కూడా ఆర్కే కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.గతంలో అనేకసార్లు ఆర్కేకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. మావోయిస్టుల పేర లేఖలు కూడా వచ్చాయి.గన్‌మెన్‌లను పెంచి భద్రత కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top