విజయమ్మ దీక్షకు వెల్లువెత్తిన అభిమానులు

గుంటూరు 23 ఆగస్టు 2013:

సమన్యాయం కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఆమెను చూసేందుకు ప్రజలు వెల్లువలా తరలి వస్తున్నారు. పార్టీ నాయకులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్.వి.ఎస్. నాగిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చేగొండి హరిరామజోగయ్య, ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు, వాసిరెడ్డి పద్మ, గొల్ల బాబూరావు, తదితరులు ప్రసగించారు. మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం సాయంత్రం దీక్షా శిబిరానికి విచ్చేసి శ్రీమతి విజయమ్మకు సంఘీభావం ప్రకటించారు. వందలాది అభిమానులతో ఆయన శిబిరానికి వచ్చారు. తొలుత శ్రీమతి విజయమ్మను పరీక్షించిన వైద్యులు తక్షణం దీక్షను విరమించాలని సూచించారు. కానీ ఆమె అందుకు ససేమిరా అన్నారు.

రాష్ట్రం గురించి తప్ప జగన్‌కు వేరే ఆలోచన లేదు: రవీంద్రనాథ్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డిగారికి రాష్ట్రం గురించి తప్ప వేరే ఆలోచన లేదని రవీంద్రారెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపనతో సోనియా గాంధీ రాష్ట్రాన్ని చీల్చాలన్న దుర్మార్గమైన ఆలపోచన చేశారన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే దాని గురించి ఆలోచన వారికి రావడం లేదన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు ముందడుగు వేస్తామంటున్నారన్నారు. సోనియా దురాలోచన కారణంగా సీమాంధ్ర ప్రాంతం మొత్తం స్మశానంలా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక్కరి బాగుకోసం ఇన్ని కోట్ల మంది భవిష్యత్తును అంధకారం చేయడానికి దారితీస్తోందన్న విషయాన్ని ఆమె గమనించడం లేదన్నారు.

విభజన వల్ల ఎంతో నష్టం
రాజశేఖరరెడ్డిగారు జీవించి ఉన్నా, జగన్మోహన్ రెడ్డిగారు బయట ఉన్నా శ్రీమతి విజయమ్మకు ఈ దీక్ష చేయాల్సిన అవసరం వచ్చేది కాదని చేగొండి హరిరామ జోగయ్య చెప్పారు. సమన్యాయం చేయాలని ఆమె కోరుతున్నారన్నారు. ప్రజల నిరసనను కేంద్రానికి వినిపించేలా ఆమె దీక్ష చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలకు సంబంధించిన అంశమన్నారు. విభజన వల్ల సీమాంధ్రకు చెందిన వారు పడే బాధ ఇంతాఅంతా కాదన్నారు.

Back to Top