బాధిత కుటుంబానికి తోట సుబ్బారావు పరామర్శ

తూర్పుగోదావరి:  సామర్లకోట  ప్రసన్నాంజనేయనగర్‌లో నివాసం ఉంటున్న అడపా శివరాజ్‌నాయుడు(25) కుటుంబ సభ్యులను సోమవారం వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు పరామర్శించారు. శివరాజ్‌నాయుడు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం విధితమే. మృతుని తండ్రి నాగేశ్వరరావును పరామర్శించి తన సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ కాళ్ల లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు కె. విజయకుమార్, కరణం భాను, శెట్టిబత్తుల దుర్గారావు, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు చిత్తూలూరి వీ్రరాజు తదితరులు పాల్గొన్ని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Back to Top