ఆ 10 లక్షల మంది టిడిపి వారే -పెద్దిరెడ్డి మండిపాటు

నెల్లూరు :
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత, ఎన్నికల సంవత్సరంలో రాష్ట్రంలోకేవలం 10
లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారనీ,  టిడిపి కార్యకర్తలనే భృతి లబ్దిదారులుగా ఎంపిక చేస్తారని
పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నెల్లూరు లో
జరుగుతున్న వంచనపై గర్జన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై
మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పోరాటానికి
బ్రాండ్ అంబాసిడర్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని
విభజించిందనీ, హోదా విషయంలో ప్రధాన దోషిగా బిజెపి నిలిచిపోతుందని ఆయన అన్నారు.
సిఎం చంద్రబాబు నాయుడికి నీతి నియమాలు లేవని కేవలం కుట్ర పూరిత రాజకీయాలు చేయడమే
ఆయన నైజమని ధ్వజమెత్తారు. హోదాపై అనేక రకాల మాట మార్చుతూ ప్రజలను వంచిస్తున్నారన్నారు.
ఆవంచనకు నిరసనగా రాష్ట్రమంతటా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు.

Back to Top