మేడాపురంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సుడిగాలి పర్యటన

చెన్నేకొత్తపల్లి: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో గురువారం  జరిగిన రెండు వివాహాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రామానికి చెందిన సాకే అచ్చమ్మ,గంగయ్యల కుమార్తె భాగ్యలక్ష్మి,కొండపల్లి కిష్టమ్మ,ముత్యాలు కుమార్తె ఉమాదేవిల వివాహాలకు  తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హాజరై  నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం  గ్రామానికి చెందిన  పెద్దకొండయ్యగారి బాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకొని బాబును పరామర్శించి ప్రమాదం ఎలా జరిగింది, ఆరోగ్య పరిస్థితి గూర్చి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గ్రామంలో ఇటీవల మృతి చెందిన నాగభూషణం, నడిపి నారాయణస్వామిల గృహాలకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతికి గల కారణాలను ఆయన వారివారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  వెంట చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్‌ మెట్టు గోవిందరెడ్డి, కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, మద్దిరెడ్డిగారి నరేంద్రరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, చిన్నగంగయ్య,సూరి, సూర్యనారాయణరెడ్డి, వెంకట్రామిరెడ్డి ,చెన్నారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి ,పెద్దారెడ్డి,అనిల్, అంజి, జాలప్ప సుబ్బరాయుడు,  రామక్రిష్ణారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి,ఆదిరెడ్డి, హనుమంతరెడ్డి,రమణారెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Back to Top