వరద బాధితులను పరామర్శించిన తోపుదుర్తి

అనంతపురం: మంత్రి పరిటాల సునీత అక్రమ కట్టడాల వల్లే నాలుగు కాలనీలు మునిగిపోయాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. అనంతలో ఆదర్శకాలనీలో వరద బాధితులను ఆయన పరామర్శించారు. ఆక్రమణ దారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
వర్షం కారణంగా మునిగిపోతున్న కాలనీల్లో సహాయ చర్యలు చేపట్టడంలో అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త నదీమ్‌ అహ్మద్‌ అన్నారు. నడిమివంక, రంగస్వామినగర్‌లో వరద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఫుడ్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సహాయక చర్యలు తీసుకోవడంలో ఎమ్మెల్యే, మేయర్‌ విఫలమయ్యారన్నారు. 
Back to Top