చెన్నేకొత్తపల్లిలో ప్రకాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు

చెన్నేకొత్తపల్లి : రాప్తాడు నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి జన్మదిన వేడుకను మం‍డల కేంద్రం చెన్నేకొత్తపల్లిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా న్యామద్దెల సర్కిల్‌లోని మహానేత వైయస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళలర్పించిన అనంతరం, ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను పార్టీ కార్యాలయంలో కట్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ ఎం.గోవిందరెడ్డి, నాయకులు గాలి శ్రీనివాసరెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణ, కృష్టమూర్తి, రాము. ఎస్టీడీ శ్రీనివాసరెడ్డి, న్యామద్దెల రామకృష్ణారెడ్డి, చిన్న ముత్యాలరెడ్డి, డి.చెన్నారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, చిన్న గోవిందరెడ్డి, చిన్న అప్పిరెడ్డి, వెంకటేస్‌తో పాటు హరియాన్‌ చెరువు నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు పాల్గొన్నారు.

Back to Top