వైయ‌స్ జ‌గ‌న్ మూడోరోజు యాత్ర షెడ్యూల్‌

అనంత‌పురం) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మూడోరోజు యాత్ర షెడ్యూల్ ను ప్రోగ్రామ్స్ కోర్డినేట‌ర్ త‌ల‌శిల ర‌ఘురామ్‌, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు శంక‌ర్ నారాయ‌ణ వెల్ల‌డించారు. ఉద‌యం యాడికి గ్రామంలో రామిరెడ్డి నివాసంలో స్థానిక పార్టీ నేత‌ల్ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుస్తారు. అక్క‌డ నుంచి క‌మ్మ‌వారిప‌ల్లె, ప‌స‌లూరు, గార్ల‌దిన్నె, చిన్న ప‌ప్పూరు వెళ‌తారు. అక్క‌డ అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకొన్న నాగ‌రాజు కుటుంబాన్ని ప‌ల‌క‌రిస్తారు. అక్క‌డ స్థానికుల‌తో మాట్లాడ‌తారు.
అనంత‌రం పెద్ద ప‌ప్పూరు, షేక్ ప‌ల్లి, నామ‌కాప‌ప‌ల్లి, వ‌ర‌దాయ‌ప‌ల్లె మీదుగా ముచ్చుకోట వెళ‌తారు. అక్క‌డ స‌మ‌స్య‌ల సుడిగుండంలో చిక్కుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన రైతు లీలా కృష్ణ‌మూర్తి కుటుంబాన్ని పరామ‌ర్శిస్తారు. కుటుంబ స‌భ్యుల‌కు జ‌న నేత భ‌రోసా క‌ల్పిస్తారు. స్థానికంగా రైతుల‌తో మాట్లాడి ధైర్యం క‌ల్పిస్తారు. 

For English version- http://goo.gl/su0327
Back to Top