వారు సమైక్య వాదులేనా!: కొణతాల

విశాఖపట్నం, 28 అక్టోబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సమైక్య శంఖారావం సభ విజయవంతం కావటంతో కాంగ్రెస్, టీడీపీలు దుఃఖంతో తల్లడిల్లుతున్నాయని పార్టీ పిఎసి కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆ పార్టీలలోని సీమాంధ్రలు అసలు సమైక్యవాదులేనా అని అనుమానం కలుగుతోందని కొణతాల అన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‌నిజ స్వరూపం ఏమిటో మీడియాపై అనుచితంగా ధ్వజమెత్తిన ఆయన తీరే అద్ధం పడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారంలోకి రాగానే వరద బాధి‌తులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామనిరామకృష్ణ హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు.

లగడపాటి రాజగోపాల్ ఆదివారంనాడు ‘సాక్షి‌ విలేకరి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కిన విషయం తెలిసిందే. పత్రికల్లో రాయలేని విధంగా భాష వాడి సాక్షి ప్రతినిధిని లగడపాటి దూషించారు. మీద మీదకు వస్తూ వీధి రౌడీలా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఇతర పాత్రికేయులనూ వదల్లేదు. బూతు పంచాంగం వినిపించి సంస్కారహీనంగా ప్రవర్తించారు. లగడపాటి తిట్ల దండకం విన్న మీడియా ప్రతినిధులు విస్తుపోయారు.

Back to Top