తప్పు చేశారు కాబట్టే చర్చకు అంగీకరించడం లేదు

ఏపీ అసెంబ్లీ: అధికార పార్టీ నేతలు తప్పు చేశారు కాబట్టే టెన్త్‌ పేపర్‌ లీకేజీపై చర్చకు అంగీకరించడం లేదని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సమస్యలపై ప్రతిపక్షంగా తీవ్ర పోరాటం చేస్తున్నామన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన లీకేజీపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సంస్కృతి కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. లీకేజీ అంశంపై 30న స్టేట్‌మెంట్‌ ఇస్తామన్న సీఎం ఈ రోజు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తన మంత్రులు తప్పు చేశారన్న భయం ఉంది కాబట్టే వారు చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. మా వద్ద ఆధారాలు ఉన్నాయి, సభలో ఈ అంశంపై చర్చిస్తే నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని ఆమె వ్యాఖ్యానించారు.

Back to Top